ఇక లాక్ డౌన్ మరింత సీరియస్…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతుంది. 15 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. యూరప్ దేశాలు సహా ప్రపంచ దేశాలు అన్నింటిలోను కరోనా చుక్కలు చూపిస్తుంది. ఇక మన దేశంలో కరోనా తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు లాక్ డౌన్ ని మరింత కఠినంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగుతుండటంతో జాగ్రత్త పడుతున్నారు.

దేశ వ్యాప్తంగా ఇప్పుడు పలు ప్రాంతాల్లో కరోనా నేపధ్యంలో కర్ఫ్యూ విధించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక పలు రాష్ట్రాల్లో కీలక అధికారులకు కేంద్రం నుంచి పలు సూచనలు వచ్చాయి. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే బయటకు వచ్చిన వాళ్ళ మీద దేశ ద్రోహం, ఉగ్రవాదుల మీద పెట్టే కేసులు పెట్టాలని ఆదేశాలు వచ్చాయి.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తెలంగాణాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని కొనసాగించడానికే మొగ్గు చూపిస్తుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరగడం తో ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో కేంద్రానికి ఇప్పటికే స్పష్టం చేసారు. లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం కోరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news