తెలంగాణకు మళ్లీ మిడతల దండు దాడి కలవరం మొదలైంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రానికి తప్పిపోయినట్టే కనిపించిన ఈ మిడతల దండు ముప్పు… మళ్ళీ మొదలైంది. దీంతో సరిహద్దు జిల్లాలపై మిడతల దండు విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు అటవీ, వ్యవసాయశాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సరిహద్దున ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలకు కెమికల్ కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 53.55 లక్షలకు కేటాయించింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్స్ నుంచి వీటిని విడుదల చేసింది.