వ్యూహాలకు పదును పెట్టిన మాజీ సీఎం కేసీఆర్.. కీలక స్థానానికి అభ్యర్థి ప్రకటన..

-

లోక్సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పడి లేచిన కెరటంలా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులు ప్రచారాలల్లో దూసుకెళ్తున్నారు.. 16 స్థానాలకి మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేయగా తాజాగా.. తెలంగాణలో కీలక సెగ్మెంట్ గా ఉన్న హైదరాబాదు లోక్సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు..

అన్ని పార్టీలకు హైదరాబాద్ సెగ్మెంట్ అత్యంత కీలకమైన నియోజకవర్గం. దీంతో టిఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ నీ బర్లోకి దింపాలని నిర్ణయించుకుంది. సామాజిక సమీకరణాలకి మాజీ సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారని లోక్ సభ అభ్యర్డుల ఎంపికల్లో మరోసారి రుజువైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పార్టీలు కొన్ని సామాజిక వర్గాలకే అధిక ప్రాధాన్యత ఇస్తే.. కెసిఆర్ మాత్రం అన్ని వర్గాలకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు.. బీసీ సామాజిక వర్గాల్లో మున్నూరు కాపులకు జహీరాబాద్ నిజామాబాద్ పార్లమెంటు స్థానాలు కేటాయించారు. చేవెళ్ల స్థానాన్ని ముదిరాజులకు సికింద్రాబాద్ ను గౌడ సామాజిక వర్గానికి, భువనగిరి హైదరాబాద్ స్థానాల్లో యాదవులకు కేటాయించి సోషల్ ఇంజనీరింగ్ కి పెద్దపీట వేశారు..

మహబూబ్నగర్ నల్గొండ మెదక్ మల్కాజ్గిరి స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు. రిజర్వ స్థానాల్లోనూ సమాన అవకాశాలు కల్పించారు ఎస్టీల్లో ఆదివాసి మైదాన గిరిజనులకు సమానంగా సీట్లు ఇచ్చారు.. ఉద్యమ నేతగా తెలంగాణను తీసుకొచ్చిన యోధుడిగా పేరు ఉన్న కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కృషిచేసిన అందరికీ పార్టీలో ప్రాధాన్య తీస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. కెసిఆర్ మరోసారి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తు చేసుకుంటున్నారు.. బెడ్ రెస్ట్ తర్వాత ఆయనే స్వయంగా రంగంలోకి దిగి అభ్యర్థులకు దిశ నిర్దేశం చేస్తున్నారు.. దీంతో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాలలో దూసుకెళ్తున్నారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news