సింహం లాంటి వాళ్ళం.. మిమ్మల్ని వదిలిపెట్టం : లోకేష్ వార్నింగ్

కర్నూలు జిల్లాలో పర్యటించిన టిడిపి లీడర్ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యంగం అమలవుతోందని.. అంబెడ్కర్ రాజ్యంగం అమలు కావడం లేదని మండిపడ్డారు. ఇద్దరు నాయకులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములను హత్య చేయడం దారుణమన్నారు. అయ్యా మేము సింహం లాంటి వాళ్లం మిమ్మల్ని వదిలిపెట్టం వేటాడతామని కొన్ని కుక్కలను హెచ్చరిస్తున్నానని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైసీపీ వాళ్ళు పశువుల్లా నరికి చంపారని..20 ఏళ్ల పాటు గ్రామాన్ని అభివృద్ధి చేయడమే వాళ్ళు చేసిన తప్పా అని నిలదీశారు. నాగేశ్వర్ రెడ్డి లైసెన్సుడు గన్ పంచాయతీ ఎన్నికల ముందు తీసుకున్నారని.. ఎన్నికల తరువాత గన్ అడిగితే ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. గన్ ఇచ్చి ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు.

నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని చంపిన వాళ్ళను 24 గంటలు గడచిన ఎందుకు అరెస్ట్ చేయలేదని ఫైర్ అయ్యారు. రాజా రెడ్డి, వైఎస్సార్ కూడా టీడీపీ శ్రేణులు చంపించారని..చివరికి వాళ్ళ గతి ఏమైందో జగన్ తెలుసుకోవాలని చురకలు అంటించారు. హత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని.. దమ్ముంటే సమగ్ర విచారణ చేయించాలన్నారు. 27 మంది టీడీపీ నేతలను హత్య చేశారు….400 మందిపై దాడి చేశారని వైసీపీపై ఆరోపణలు చేశారు…వీటిని వ్యక్తిగాంతంగా తీసుకుంటా….వడ్డీతో సహా చెల్లిస్తా అని హెచ్చరించారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటా…వారిని అదుకుంటానని హామీ ఇచ్చారు లోకేష్.