ఏపీలో పెద్ద ఎత్తున డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

-

ఏపీలో పెద్ద ఎత్తున డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. ANSET CEO గా పని చేస్తున్న సి. హరి ప్రసాద్ కర్నూలు ఆర్డీవో గా బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్  బి. చంద్ర లీలకు నెల్లూరు ఎఫ్ఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ అద్దయ్యకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.

పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ పి. ఉమాదేవికి ప్రకాశం జిల్లాలో ఎఫ్ఎస్ఓ గా బాధ్యతలు అప్పగించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణ మూర్తికి విజయనగరం జిల్లా ఎఫ్ఎస్ఓ గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news