BREAKING : వైయస్ షర్మిలకు లుక్ అవుట్ నోటీసులు

-

వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్ షర్మిలకు LOOK OUT నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ షర్మిల తెలిపారు.నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నాపై LOOK OUT నోటీసులు ఇవ్వడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనంఅని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.

ఇప్పటికే రెండుసార్లు నిరుద్యోగుల తరఫున కొట్లాడకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు దుర్మార్గంగా LOOK OUT నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారని అగ్రహించారు వైఎస్ షర్మిల. TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణంలో సిట్ పెద్ద తలకాయలను వదిలేసి, చిన్న ఉద్యోగుల తప్పిదం మాత్రమే అని చూపే ప్రయత్నం చేస్తోంది. దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరిపేంతవరకు YSR తెలంగాణ పార్టీ కొట్లాడుతుందన్నారు.

TSPSC పేపర్ లీకులపై ఉద్యమిస్తున్న ఓయూ, కేయూ విద్యార్థులపై సర్కార్ చేపడుతున్న అణచివేత చర్యలను ఖండిస్తున్నాం. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి లాఠీ ఛార్జీలు, అరెస్టులు చేయడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం అన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news