బ్రేకింగ్ : ‘లవ్ స్టోరీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఫిదా బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజై ప్రేక్షకులను పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

మజిలీ, వెంకీమామా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్లాన్ లో ఉన్నాడు. ఇక లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10 వ తేదీన విడుదల చేయాలని అనుకున్న మరోసారి వాయిదా పడింది. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా కి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.