నాగచైతన్యకి బర్త్‌ డే గిఫ్ట్‌ ఇచ్చిన లవ్ స్టోరీ యూనిట్..!

-

అక్కినేని నాగార్జున తనయుడు యంగ్ హీరో నాగచైతన్య పుట్టిన రోజు. ఆయన జోష్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యాడు. నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రం ‘ఏం మాయ చేసావే’ లో అవకాశం దక్కించుకున్నాడు. భారీ అంచనాలతో విడుదల అయిన ‘జోష్’ బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేయలేకపోయినా నటుడిగా చైతుకు గుర్తింపు నిచ్చింది. ఆ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా విడుదల అయిన ‘ఎం మాయ చేసావే’ సినిమా హిట్ అవటంతో చైతు హీరోగా నిలదొక్కుకున్నాడు.

naga chaithanya
naga chaithanya

గౌతం మీనన్ దర్శకత్వంలో సమంత కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కరోనా కంటే ముందే మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. చకచకా ఈ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తో ఎప్పుడెప్పుడు లవ్ స్టోరీ రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ రిలీజ్ చేసి… స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఈ కొత్త పోస్టర్లో నాగ చైతన్య బనీన్‌, లూంగీతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. ఇటీవలే ఈ సినిమా నుంచి సాయిపల్లవి, నాగచైతన్య పెళ్లి పీటలపై ఉన్ పోస్టర్‌ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news