ఎల్‌పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఆ విషయాల్లో మార్పులు..!

-

ఎల్‌పీజీ వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్. సిలిండర్లు బుక్ చేయడం పైన లిమిట్ ని పెట్టనుంది ప్రభుత్వం. ఈ విషయం పలు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. ఇక నుండి ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకునే అనుమతి వుంటుందట.

ఈ లిమిట్ కనుక దాటితే ఎక్స్ట్రా గ్యాస్ సిలెండర్లని బుక్ చేసేందుకు అవ్వదట. కేవలం కేటాయించినన్ని సిలెండర్లను మాత్రమే బుక్ చేసుకోవాలని పలు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. నెలకు కేవలం రెండే బుక్ చేసుకోవాలట. ఆ లిమిట్ దాటి బుక్ చేసేందుకు కుదరదు.

ఇదిలా ఉంటే గ్యాస్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 1, 2017 నుంచి జూలై 6, 2022 వరకు ఎల్‌పీజీ ధరలను 58 సార్లు మార్చేశాయి. దీనితో 45 శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. 2017న రూ.723 ఉంటే.. రూ.1,053కి పెరిగింది ఇప్పుడు. ఈ ఏడాది చూస్తే 26 శాతం పెరిగింది. జూలై 1, 2021 నుంచి జూలై 6, 2022 మధ్యలో ఇలా గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి. అన్ని ప్రాంతాల్లో ధరలు ఒకే విధంగా వుండవు. ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. రాష్ట్రాల్లోని వాల్యూ యాడెడ్ ట్యాక్స్, రవాణా ఛార్జీలు బట్టీ ఈ రేట్లు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news