నేటి సమాజంలో గూగుల్ పే ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చాలా మంది గూగుల్ పే యూజర్లు రివార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అవతలి వ్యక్తులకు డబ్బులు పంపాక వచ్చే స్క్రాచ్ కార్డును చూసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కొంతమంది. కానీ చాలా సందర్భాల్లో నిరాశే మిగులుతుంది. కొన్ని సందర్భాల్లో స్క్రాచ్ కార్డు రివార్డు లభించించిన అది 100 రూపాయలలోపే ఉంటుంది. ఇక అతి కొద్ది సందర్బాల్లో మాత్రమే రివార్డు లభిస్తోంది.
అదృష్టం ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలీదు అని అంటుంటే చాల సార్లు విన్నాం. తాజాగా ఓ వ్యక్తికీ అలాంటి అదృష్టమే వరించింది. అయితే ఓ వ్యక్తి ఏకంగా లక్ష రూపాయల గూగుల్ పే రివార్డు లభించింది. ఇక లక్ష రూపాయల రివార్డు లభించడంతో ఆ వ్యక్తి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ అరుదైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగమల్ల సంపత్ నగరంలో ఖిలీల్ వాడీలో సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు. సంపత్ తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను నిర్వహించడానికి గూగుల్ పే బిజినెస్ యాప్ను వినియోగిస్తున్నాడు. ఇక రోజువారి తన లావాదేవీలను ఆ యాప్ ద్వారానే చేపడుతున్నాడు. సోమవారం కూడా ఓ లావాదేవీని చేసిన సంపత్ కు స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో ఏముందో చూడగా.. రూ.లక్ష రూపాయలు రివార్డు వచ్చినట్టు కనిపించింది. గతంలో చిన్న మొత్తంలో రివార్డులు చూసిన సంపత్.. ఒక్కసారిగా లక్ష రూపాయలు రావడంతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపి ఆనందంతో పొంగిపోయాడు. సంపత్ కు నేడు గూగుల్ పే లోకల్ యూనిట్ నిర్వాహకులు సన్మానం చేయనున్నట్టుగా సమాచారం.