షాకింగ్: సిఎంను హౌస్ అరెస్ట్ చేసిన కేంద్రం

-

సింఘ్ సరిహద్దు వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేసిన రైతులను పరామర్శించి తిరిగి వచ్చిన సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను వర్చువల్ గృహ నిర్బంధంలో ఉంచారని ఢిల్లీ అధికార ర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన ఆరోపణలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ను సింగూ సరిహద్దు నుంచి తిరిగి వచ్చిన తరువాత సోమవారం నుంచి రైతు నాయకులను కలిసిన తరువాత గృహ నిర్బంధ పరిస్థితుల్లో ఉంచారని ఆప్ వర్గాలు ఆరోపించాయి.

kejriwal

దీనితో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశాలన్నీ రద్దు చేసారు. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ కు చెందిన ముగ్గురు మేయర్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ప్రధాన ద్వారం వెలుపల ధర్నాపై కూర్చున్నారని ఆప్ వర్గాలు ఆరోపణలు చేసాయి. పోలీసులు కేజ్రీవాల్ నివాసానికి బారికేడ్ కూడా చేసినట్లు ఆప్ నాయకులు తెలిపారు. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఈ ఆరోపణలు చేసారు. మా ఎమ్మెల్యేలను కూడా సిఎంను కలవడానికి అనుమతించడం లేదు అని మేము సిఎం ఇంటికి కవాతు చేస్తాము అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news