ఉమ్మనీరు పోతున్నా.. ఆఫీస్‌ మీటింగ్‌కు అటెండవ్వాల్సిందేనా?

-

ఇప్పుడు మనం తెలుసుకోబుతున్న వార్త ఒకవిధంగా పని ఒత్తిడి వల్ల జరిగిన సంఘటనలు. సాధారణంగా ఎక్కడైతే జాబ్‌ ఆఫర్‌లు ఎక్కువ ఉంటాయో, అక్కడ తక్కువ అర్హత కలిగిన వ్యక్తులను ఆకర్షిస్తాయి. ఆ జీతాలు, ఇన్సెంటీవ్స్‌ దీంతో వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జాబ్‌ను వదులుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఉద్యోగాలు తక్కువగా ఉంటే ఎంత కష్టమైన పనినైనా చేస్తారు. ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది. వాళ్లు వదిలేసిన జాబ్‌లో వేరే వాళ్లు ఈజీగా వస్తారు. అందుకే ఎంతటి కష్టమైనా భరిస్తారు.

దీనికి ఆ జాబ్‌లో పనిచేస్తున్న వ్యక్తి మెంటల్‌ స్ట్రెస్‌ ఎక్కువ ఉన్నా, ఆ పనిని పూర్తి చేస్తారు. ఇలాంటి వార్తే ఒక మహిళ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఇది తనకు ఎదురైన అనుభవం. కడుపుతో ఉన్న తను ఆస్పత్రికి వెళ్తూ మార్గ మధ్యంలో ఆఫీస్‌ మీటింగ్‌కు అటెండ్‌ అవ్వాల్సిన పరిస్థతి. ఒకవైపు ఉమ్మనీరు పోతుండగా, తను మీటింగ్‌కు అటెండ్‌ అవ్వాలని ఒత్తిడి. ఈ విషయాన్ని క్రిస్టినా కారిల్లో అనే మహిళ ట్విట్టర్‌లో షేర్‌ చేసుకుంది. ‘ మిత్రులారా! నేను మీటింగ్‌లో ఉండగానే ఉమ్మనీరు పోయింది, నేను ఆస్పత్రికి వెళ్లాలి ఇప్పుడు అని తను బోర్డు మెంబర్స్‌కు తెలిపింది. దానికి వారు ఓకే! మనం ముందు సమావేశాన్ని ముగిద్దాం’ అని జవాబు ఇచ్చారట. ఎట్టకేలకు ఆమె ఆస్పత్రికి వెళ్తూనే బోర్డు మీటింగ్‌ను పూర్తిగా అటెండ్‌ అయ్యింది. అసలు ఈ సమాజం ఎక్కడికి పోతుంది. ఒకవేళ తను ఈ మీటింగ్‌ అటెండ్‌ అవ్వకపోతే ప్రమోషన్‌ పోతుందా? ఆ ఎంప్లాయర్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ను నిందించాలా? లేక మొత్తం సమాజామా? ఈ విధంగా తయారవ్వడానికి ఎవరు అసలు కారణం. నెటిజెన్స్‌ కూడా దీనికి స్పందించారు.

దీనికి ఒక నెటిజెన్‌ తన కు లాస్ట్‌ మంత్‌ ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా ఆమె ఎందుకు ఆఫీస్‌ మీటింగ్‌కు అటెండ్‌ అవుతోంది. చివరి నిమిషం వరకు పని చేస్తూనే ఉండాలా? అని స్పందించారు. ఇంకో నెటì జెన్‌ ‘నా వైఫ్‌కు అబార్షన్‌ అయింది. అప్పుడు నా బాస్‌ దాదాపు 30 ఏళ్ల మహిళకు ఆస్పత్రికి వెళ్లాలని జరిగిన విషయం చెబితే, సరే! కానీ, ఎక్కువ లేట్‌ చేయకండి అనింది అని చెప్పాడు. ఇలా ఎలా ఒక లేడీ బాస్‌ తన వద్ద పనిచేసే వేరే మహిళను పట్టించుకోకపోతే, తన మానసికంగా ఎలా ఆరోగ్యంగా ఉంటుంది. వారు ఒత్తిళ్లకు లోనవ్వల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో నెటిజెన్‌ కూడా రోజు మొత్తం సమావేశానికి హాజరయ్యి, బిడ్డను కనే చివరి గంటకు ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి స్టార్టప్‌ కంపెనీల్లో ఇవి సర్వ సాధారణం అని తెలిపింది. ఇంకొకరికి తండ్రి చనిపోతే కూడా తన శవాన్ని వాళ్ల ఊరికి తీసుకేళ్తున్న వాహనం నుంచే మీటింగ్‌కు హాజరవ్వాల్సిన దుస్థితి. ఆర్థికంగా చితికిపోయిన వారిపై ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతోన్న దృశ్యం కూడా ఇటువంటిదే. ఒక మహిళ ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టుకునే వంటగదిలో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని ఆమె కుమారుడే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసాడు. అసలు అతను వాళ్ల అమ్మ వంట చేస్తోంటే సోంబేరిలా కూర్చోని వీడియో తీసాడు. ఏ.. అతనేమి ఆ అమ్మకు సాయం చేయలేడా?

 

Read more RELATED
Recommended to you

Latest news