Naga Shaurya: దూసుక‌పోతున్న “ల‌క్ష్య” లిరికల్ సాంగ్!

-

Naga Shaurya: విభిన్న క‌థాంశాల చిత్రాల‌ను ఎంచుకుంటూ.. త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాగ‌శౌర్య‌. త‌న కెరీర్ ఆరంభం నుంచే తెలుగు తెరపై హవా సాగిస్తున్న విలక్షణ నటుడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. ప్రేక్ష‌కుల మదిలో ప్ర‌త్యేక స్థానాన్ని సాధించుకున్నాడు కథకు ప్రియార్టీ ఇస్తూ.. ల‌క్ష్య అనే స్టోర్స్ బ్యాక్ డ్రాప్ తో ముందుకు రాబోతోన్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే థియేటర్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య జంట‌గా కేతిక శర్మ నటిస్తుంది. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో.. ప్రచారం వేగవంతం చేసింది
చిత్ర‌యూనిట్. ఇందులో భాగంగా ‘‘ఓ లక్ష్యం’ అనే గీతాన్ని విడుదల చేశారు. అర చేతుల్లో దాచి.. వెలిగించే దీపం తానే.. అంటూ ఓ ఇన్సిప్రేష‌న‌ల్ సాంగ్ ను విడుద‌ల చేశారు మూవీ యూనిట్. ఈ పాటకు రెహమాన్‌ సాహిత్యం అందించగా.. హైమత్‌ మహమ్మద్ పాడారు. ఈ పాటలో నాగ శౌర్య, జగపతి బాబుకు మధ్య ఉన్న బంధం తెలుస్తుంది. ఆర్చ‌రీ నేప‌థ్యంలో రాబోతోన్న ఈ చిత్రంలో రెండు విభిన్న గెటప్పుల్లో నాగ శౌర్య కనిపించబోతోన్నారు. ఈ చిత్రం కోసం నాగ శౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news