నేడు బీజేపీ నేతలతో మోడీ కీలక సమావేశం

-

భారతీయ జనతా పార్టీ.. క్రమశిక్షణకు మారుపేరు. అయితే మొన్న జరిగిన ఉప ఎన్నికల పోరులో.. చాలాచోట్ల ఘోర పరాభవాన్ని చవి చూసింది బిజెపి పార్టీ. ఈ నేపథ్యంలోనే ఇవాళ దేశ రాజధాని అయిన ఢిల్లీ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభంకానుంది బిజెపి జాతీయ కార్యవర్గ భేటీ. అయితే ఈ సమావేశంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు మోడీ.

కరుణ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరికీ ఢిల్లీ కి ఆహ్వానించలేదు. 124 మంది కార్యవర్గ సభ్యులు మాత్రమే ప్రత్యక్షంగా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అలాగే… మొన్న ఉప ఎన్నికల్లో.. బిజెపి పార్టీకి ఎదురు దెబ్బ తగిలిన విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనుంది బిజెపి పార్టీ. ముఖ్యంగా వచ్చే వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పైనే ఈ సమావేశం ఫోకస్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news