ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి తనయుడు, నటుడు రాజా చెంబోలు తన నిశ్చితార్థం జరిగినట్లు శనివారం సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. “ఇది 2020లోనే బెస్ట్ పార్ట్. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు” అని రాసుకొచ్చారు. దీంతో త్వరలో ఒక్కటి కానున్న ఈ జంటకి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా రాజా.. అంతరిక్షం, ఎవడు, హ్యాపీ వెడ్డింగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఫిదా , రణరంగం, మిస్టర్ మజ్ను, ఏబీసీడీ’ వంటి ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన నితిన్, నిఖిల్, రానా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివాళ్లైతే, నిహారిక నిశ్చితార్థం చేసుకుని పెళ్లి డేట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ జాబితాలోకి రాజా చెంబోలు కూడా చేరిపోయాడు.