రాజధానిలో గణేష్ మండపాలకు నో పర్మిషన్.. తేల్చిచెప్పిన ప్రభుత్వం..!

-

కరోనా నేపథ్యంలో వినాయక చవితి పండగపై పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం సైతం గణేష్ మండపాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అన్ని జిల్లాల అధికార యంత్రాంగాలకు సూచనలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మంటపాలకు, మొహర్రం రోజున పీర్ల ఊరేగింపునకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇళ్లల్లోనే వినాయక చవితి పూజలు చేసుకోవాలని సూచించింది.

అలాగే నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించిన‌వారికి రూ.50 వేలు ఫైన్ విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గణేష్ వేడుకులపై ఆంక్షలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, ఉగాది, గుడ్‌ఫ్రైడే, శ్రీరామనవమి, రంజాన్, బోనాలు, బక్రీద్, పంద్రాగస్టు.. ఇలా పండులన్నీ కరోనా కారణంగా నీడారంబరంగా జరుపుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news