ఈటలకు షాక్ : టీఆర్ఎస్ అభ్యర్థికి సీపీఐ, సీపీఎం మద్దతు !

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. బిజెపి పార్టీ తరఫున ఈటల రాజేందర్ బరిలో ఉండగా అధికార టిఆర్ఎస్ పార్టీ తరఫున గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున… విద్యార్థి నాయకుడు వెంకట పోటీ చేస్తున్నాడు. అయితే హుజరాబాద్ నియోజకవర్గంలో పోటీ మాత్రం బిజెపి మరియు టిఆర్ఎస్ పార్టీల మధ్య ఉండనుంది.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ టిఆర్ఎస్ ఇటు ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప పోరు… రసవత్తరంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. లెఫ్ట్ పార్టీలైన సిపిఎం మరియు సీపీఐ లు… ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి… మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే సిపిఎం పార్టీ ఈ నిర్ణయం తీసుకోగా.. సిపిఐ పార్టీ కూడా అదే బాటలో వెళ్లాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే దీనిపై జాతీయ నాయకత్వంతో చర్చలు చేసింది రాష్ట్ర సిపిఐ పార్టీ. మరో రెండు రోజుల్లోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నాయి రెండు పార్టీలు. ఒకవేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపితే… ఈటల రాజేందర్ కు షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.