అల్లర్లతో ’మా‘ పరువు తీయొద్దు.. – మెగాస్టార్ చిరంజీవి

-

టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా ’ మా‘ ఎన్నికలు రసాభాస స్రుష్టించాయి. వివాదాలు, విమర్శలతో రచ్చకెక్కారు. మా ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ఇండస్ట్రీ పెద్దలు కాస్త అసంత్రుప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పెళ్లి సందడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో ’మా‘ పరువు తీయోద్దని సున్నితంగా హెచ్చరించారు. చిన్న చిన్న పదవుల కోసం ఇగోలకు పోవద్దు. వీటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం అవసరమా అని అన్నారు. పదవులు తాత్కాలికం మాత్రమే అని రెండు ఏళ్లు ఉండే పదవుల కోసం వివాదాలు తెచ్చుకోవద్దని కోరారు. మనమంతా వసుదైక కుటుంబంగా ఉండాలని చిరంజీవి అన్నారు. వివాదాలు పుట్టించిన వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరారు. మనం మనం గొడవులు పెట్టుకుని ఇతరుల ముందు చులకన కావద్దన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావ్రుతం కాకూడదని అన్నారు. పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఉండవని చిరంజీవి అన్నారు. ఇలాంటి ఘటను చూసినప్పుడు బాధ అనిపిస్తుందని అన్నారు. మన అధిపత్యం చూపించుకోవడం కోసం ఇతరులను కించపరచాలా..? అని అన్నారు. ఇండస్ట్రీలో ఆప్యాయంగా, ఆత్మీయంగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news