ఈ 5 రాశులవారు ఏం చేసిన విజయం సాధిస్తారట..! 

-

మనరాశులను బట్టి మన ప్రవర్తను అంచానా వేసేయొచ్చట. ఎందుకంటే ఎక్కువశాతం మంది వాళ్లరాసులకు తగ్గట్టుగానే ప్రవర్తిస్తుంటారు. ఆ విషయం వారికి కూడా తెలియదు. మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి సమయం అనుకూలంగా ఉందని, కొన్ని రాశుల వారికి సమయం అనుకూలంగా లేదని పండితులు చెబుతూ ఉంటారు..మనము వినే ఉంటాం.
horoscope
మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉండే రాశుల వారి విషయానికి వస్తే.. కేవలం 5 రాశుల వారు మాత్రమే మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారని పలువురు చెబుతున్నారు. వారితో ఇతర రాశుల వారు వైరం పెట్టుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందట. కావున వారితో స్నేహపూర్వకంగా మెదలడమే చాలా మంచిది. పైగా ఈ 5 రాశుల వారు తమ జీవితంలో ఏం చేసిన విజయం వారి సొంతం అవ్వాల్సిందేనట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సింహ రాశి -లియో

సింహ రాశి వారు పేరుకు తగ్గట్టుగానే..వీరు పుట్టుకతోనే లీడర్లుగా పుడతారు. అందర్నీ ఏలడం కోసమే జన్మించారా? అన్నట్లు వారి ప్రవర్తన ఉంటుంది. ఈ రాశి వారు ఎవరితో త్వరగా కలవలేరు. వీరు ఎప్పటికీ ఒంటరిగా సింహంలాగానే బతుకుతారు. ఒక టీమ్లో సభ్యుడిగా వీరు ఈజీగా కొనసాగలేరు. వారు తమ మాటను నెగ్గించుకోవడం కోసం చూస్తారు. తమమాటను చెల్లించుకోవటం వీరికి తెలిసినంతగా మరే రాశివారికి తెలియదు.
ఈ రాశి వారు తాము కోరుకున్నది పక్కా చేస్తారు. వీరి ఆలోచనా విధానం చాలా షార్ప్ గా ఉంటుంది. నిజానికి ఆ ఆలోచనా విధానం వలన వీరు చాలా ఫేమస్ అవుతారు. ఏ విషయమైనా సరే ఈ రాశివారు త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కావున వీరు చాలా త్వరగా రిజల్ట్స్ రాబడతారు. సింహ రాశి వారికి ఎటువంటి పని అప్పగించినా కానీ అందులో వారు ఈజీగా విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ఎక్కడ ఉన్న సింహంలాగే బతుకుతారు. కావున ఈ రాశి వారిని ఎటువంటి పని కోసమైనా ఈజీగా మనం నమ్మెయవచ్చు.

మకర రాశి- కాప్రికాన్

మకర రాశి వారు చాలా కష్టపడి పని చేసే తత్వం కలిగి ఉంటారు. వారు మంచి మోటివేటర్స్ గా పని చేస్తారు. వారు ఎప్పుడు కూడా బ్రేక్ డౌన్ కాలేరు. అనుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ఈ రాశి వారు ఫిజికల్గా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. వీరికి ఏ పనిని అప్పగించినా చాలా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

వృశ్చికం- స్కార్పియో

స్కార్పియో అని వృశ్చిక రాశిని పిలుస్తారు. ఈ రాశి వారు చాలా సక్సెస్ ఫుల్గా ఉంటారు. కేవలం సక్సెస్ ఫుల్ మాత్రమే కాదు.. చాలా పవర్ ఫుల్. కావున వీరితో ఇతర రాశుల వారు తగాదా పెట్టుకోవడం మంచిది కాదు. ఈ రాశి వారు ధృడమైన వారు. ఈ రాశి వారికి ఉండే విలక్షణమై లక్షణం ఏంటంటే….ఏదైనా విషయం జరగాలని కోరుకుంటే ఏం చేసైనా అది సాధించే వరకు నిద్రపోరు. పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధిస్తారు. ఈ ప్రయత్నంలో బయటి వ్యక్తులు ఎలా సఫర్ అయిన వీరు పట్టించుకోరు. అవతలి వారిని బెదిరించైనా, భయపెట్టైనా అనుకున్నది చేస్తారు. ఇది వారిని చాలా శక్తివంతులుగా తయారు చేస్తుంది.
తమకు నచ్చనిది చేస్తే ఈ రాశి వారి కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. వారు ఒక పనిని పూర్తి చేయాలని మైండ్ లో ఫిక్స్ అయితే ఇక వారిని ఆపడం ఎవరి తరం కాదు. ఇలాంటి వారు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు.
రాశులు

వృషభ రాశి- టారస్

వృషభ రాశి వారు కూడా మెంటల్గా ఫిజికల్ గా చాలా పవర్ ఫుల్. వీరు ఎమోషనల్గా ధృడంగా ఉంటారు. వీరికి ప్రేమ విలువ బాగా తెలుసు. కావున ఈ రాశి వారు వారిని ప్రేమించే వ్యక్తులను వదులుకునేందుకు అస్సలు ఇష్టపడరు. వృషభ రాశి వారి మార్గంలో ఎవరు వచ్చినా సరే ఈ రాశి వారికి ప్రత్యర్థులుగా మారుతారు. కావున ఈ రాశి వారు చేసే పనికి అడ్డుతగలడం మానుకోవాలి. ఈ రాశి వారితో శత్రుత్వం అంత మంచిది కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ రాశి వారు తమకు కావాల్సిన వారి కోసం ఎంతటి సహాయమైనా చేస్తారు. ఆప్తులు ఆపదలో ఉన్నపుడు ఈ రాశి వారు వారిని తప్పకుండా ఆదుకునే స్వాభావం కలిగి ఉంటారు.

మేషరాశి

ఈ రాశి వ్యక్తులు చాలా డైనమిక్. మరియు చాలా యాంగ్రీగా ఉంటారు. కావున వీరితో మనం జోక్స్ చేయడం అంత మంచిది కాదు. ఈ రాశి వారు కనుక దేని మీదైనా కన్నేస్తే అందులో గెలిచి చూపిస్తారు. బిజినెస్లో వీరికి ఎదురే ఉండదు. ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో వారి మార్క్ ను తప్పకుండా చూపిస్తారు. ఎలాంటి పనులు చేయడం వలన సమాజంలో ప్రత్యేక గుర్తింపు వస్తుందో ఈ రాశి వారికి తెలిసినంతంగా వేరే ఏ రాశుల వారికి పెద్దగా తెలియదు. వీరు అందరిలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు.
ఇదంటి సంగతి…పైన పేర్కొన్న విధంగా ఈ అయిదు రాశుల వారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఒకవేళ మీ రాశి ఇందులో ఉంటే ఇప్పుడే మీ ఆత్మీయులకు షేర్ చేసేయండి. రాశులను బట్టే అన్ని వాటంతట అవే జరిగిపోతాయని అనుకోకూడదు. మనం అనుభవించే ప్రతిసుఖం వెనుక ఒక మినీ యుద్దమే ఉంటుంది ఓ సినిమాలో చెప్పారు..నిజంగా అది కరెక్టే..ఏదైనా పొందాలి అనుకుంటే దానికి తగ్గట్లు మనం కృషి చేయాలి. రాశులను మాత్రమే నమ్ముకుంటే ఏదిరాదు. కేవలం అవగాహనకోసం మాత్రమే పైన చెప్పబడింది కానీ ‘మనలోకం’ కన్ఫామ్ చేసి చెప్పలేదు. న్యూమారాలజిస్ట్ లు చెప్పిన సమాచారం ఆధారంగా మాత్రమే రాయబడింది.
– Triveni Naidu

Read more RELATED
Recommended to you

Latest news