‘మా ఊరి పొలిమేర‌` సీక్వెల్ వచ్చేస్తుంది!

-

సత్యం రాజేష్, బాలాదిత్య, రవి వర్మ, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరీ కృష్ణ నిర్మాత. డాక్టర్. అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. 2021 డిసెంబర్ లో నేరుగా ప్రముఖ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఆడియన్స్ ను అలరించింది. అప్పుడే ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. తాజాగా ‘మా ఊరి పొలిమేర’ సీక్వెల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను జరుపుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news