ఆధార్ యాప్ ని వాడుతున్నారా..? అయితే మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోండి…!

-

చాల మంది ఎంఆధార్ యాప్ వాడుతున్నారు. మీరు కూడా ఎంఆధార్ యాప్ వాడుతున్నారా…? అయితే ఇలా చెయ్యాల్సిందే. యూఐడీఏఐ తాజాగా ఒక సమాచారాన్ని ఇచ్చింది. దాని ప్రకారం మీరు పాత వెర్షన్ యాప్స్‌ను డిలేట్ చేసుకోవాలని యూఐడీఏఐ తెలిపింది. దీనిని కాకుండా కొత్త వెర్షన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వాడాలని తెలిపింది. ఇంకా యాప్ గురించి చూస్తే…. ఆధార్ కార్డు కలిగిన వారు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిన ఎంఆధార్ యాప్‌ను ఉపయోగించొచ్చు.

ఎంఆధార్ యాప్ ద్వారా దాదాపు 35 రకాల సర్వీసులను ఒకే చోట పొందొచ్చు. ఇది ఇలా ఉండగా యాప్ సేవలను కనుక మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించాలని అనుకుంటే కనక ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్‌ను డిలేట్ చేసేసి, కొత్త వెర్షన్ ఎంఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని వివరించింది. ఎంతో ఈజీగా మీరు ఈ పనిని ప్లే స్టోర్ లో చేసుకోవచ్చు.

ఆధార్ డౌన్‌లోడ్, అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం, బయోమెట్రిక్స్ లాన్, అన్‌లాక్ ఇలా 35 రకాలకు పైగా ఆన్‌లైన్ సేవలు మీరు ఈ యాప్ ద్వారా పొందొచ్చు. ఇది ఇలా ఉంటె ఆధార్ కార్డు గురించి మనకి తెలుసు. దీని వలన చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కీలకమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి అని మనకి తెలిసినదే.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news