పెద్దపల్లి జిల్లాలో దారుణం : సామూహిక అత్యాచారం, 14 మంది నిర్భందం !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గౌరెడ్డి పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది..ఇటుక బట్టీలో పని చేయడానికి ఒడిశా నుంచి వచ్చిన ఒక వివాహిత మీద ఐదుగురు యజమానులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సదరు వివాహిత మీద అతని భర్త మీద కూడా దాడి చేశారు..అయితే ఇక్కడ ఉంటే తమ పరిస్థితి దారుణంగా మారుతుంది అని భావించిన దంపతులు అక్కడి నుంచి తప్పించుకుని ఒడిషాలోని సొంత గ్రామానికి వెళ్లడానికి బయలుదేరారు..

అయితే వారిని రామగుండం రైల్వే స్టేషన్ లో పట్టుకున్న యజమానులు మళ్ళీ ఇసుక ఇటుక బట్టీల వద్దకు తీసుకు వెళ్ళి తీవ్రంగా గాయ పరిచారు. ఇక వీరికి సంబంధించి సాక్ష్యం చెబుతారేమో అనే అనుమానంతో మరో 14 మంది కూలీలను కూడా నిర్బంధించి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గత నెల 24వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ అంశం మొత్తాన్ని గుర్తు తెలియని వ్యక్తులు మానవ హక్కుల సంఘానికి లేఖ రాయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు ఆర్డీవో విచారణ నిమిత్తం అక్కడికి వెళ్లారు. అయితే సదరు భార్యాభర్త ఇటుక బట్టీల వద్ద కనిపించలేదు. యజమానులే వారిని దాచి పెట్టి ఉంటారని ఇతర కూలీలు అనుమానం పడుతున్నారు.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...