రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఆర్మీ మేడిన్‌ ఇండియా ఆయుధాలు

-

ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఇందులో ఒకటే ఈ పరేడ్‌కు మేడిన్ ఇండియా ఆర్మీ ఆయుధాలు మాత్రమే ప్రదర్శించనుంది ఆర్మీ. ఈ పరేడ్‌కు సంబంధించిన వివరాలను దిల్లీ ఏరియా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మేజర్‌ జనరల్‌ భవినీష్‌ కుమార్‌ వెల్లడించారు. ఉదయం 10.30కు ఈ పరేడ్‌ విజయ్‌ చౌక్‌ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగుతుంది. ఈ ఏడాది కర్తవ్యపథ్‌(గతంలో రాజ్‌పథ్‌గా పిలిచే మార్గం)లో రిపబ్లిక్‌ డే కార్యాక్రమంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఆయుధాలను ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఆయుధాలు కాకుండా.. ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయుసేన, నేవీకి చెందిన ఒక్కో బృందం దీనిలో పాల్గొంటాయి.

ఇప్పటికే దిల్లీలో పరేడ్‌కు సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ పరేడ్‌కు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి ముఖ్య అతిథిగా రానున్నారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌కు సంబంధించిన టికెట్లను కూడా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రిపబ్లిక్‌ డే ఫ్లైపాస్ట్‌లో మొత్తం 44 విమానాలు పాల్గొననున్నాయి. వీటిల్లో తొమ్మిది రఫేల్‌ జెట్‌ విమానాలు కూడా ఉండనున్నాయి. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి అటాక్‌ హెలికాప్టర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news