సచివాలయ పనులు పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్

-

తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. సచివాలయ నిర్మాణ పురోగతిని పరిశీలిస్తున్నారు. సీఎం వెంట మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. సచివాలయ ప్రాంగణంలో కేసీఆర్‌.. పనుల గురించి ఇంజినీర్లను, అధికారుల్ని అడిగి తెలుసుకుంటున్నారు.

పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఇంటీరియ‌ర్ ప‌నులు ముమ్మరంగా కొన‌సాగుతున్నాయి. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల మేర భవనాన్ని నిర్మిస్తున్నారు. సచివాలయ నిర్మాణ కోసం సిబ్బంది, కార్మికులు… మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సుధీర్ఘకాలం రాష్ట్ర అవసరాలకు పనికొచ్చే విధంగా పటిష్ఠంగా నిర్మాణం చేస్తున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ పద్ధతిలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు.

సహజంగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త సచివాలయానికి ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టారు. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భవనం లోపల కలియతిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news