ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే ఇలా రైతులు ఫాలో అవ్వండి..!

-

రైతులు అధిక లాభాలను పొందాలంటే పంట కోత కోసిన వెంటనే అమ్మకూడదు. కొన్ని రోజులపాటు నిల్వ ఉంచి అప్పుడు అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఏ పంట అయినా సరే అంతే అయితే మీరు ఉల్లిని పండిస్తున్నరా..? ఉల్లిపాయల్ని ఎలా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు తప్పకుండా హరియానా రైతు చేసినా గమ్మత్తుని చూడాలి. ఈ ఐడియా నిజంగా అదిరిపోయింది. రైతులందరూ ఈ విధంగా అనుసరిస్తే ఉల్లిపాయల్ని నిల్వ ఉంచుకోవడం సాధ్యం. అయితే మరి ఉల్లిపాయలని నిల్వ ఉంచుకుని ఆ తర్వాత అమ్ముకుంటే మాత్రం అదిరిపోయే లాభాలు వస్తాయి.

అయితే సాధారణంగా ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఎంత చక్కగా నిల్వ ఉంచడానికి ప్రయత్నించినా 10% ఉల్లిపాయలు అయిన కుళ్లిపోతాయి. అలా కాకుండా ఎక్కువ కాలం పాటు ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే ఈ విధంగా చెయ్యండి. సాధారణంగా రైతులు ఉల్లి నిల్వ చేయడానికి గోన్లని ఉపయోగిస్తారు. ఉల్లిపాయల్ని గోను సంచుల్లో వేసి స్టోర్ చేస్తారు. అయితే ఖర్చు లేకుండా ఒక రైతు మాత్రం మంచి ఐడియాని కనిపెట్టాడు.

దీంతో ఉల్లిపాయలు సమర్థవంతంగా నెలల పాటు నిల్వ ఉంటాయి. ఉల్లి సాగు చేస్తున్నప్పుడు ఈ రైతు వరిదుబ్బలని కోయించి వాటిని వరుసల మధ్య పేర్చి మల్చింగ్ లా వినియోగిస్తున్నారు. దీనివల్ల సాగునీటి కొరతకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఈయన గోను సంచుల్లో నిల్వ చేయకుండా ఉల్లి కోత తర్వాత కాడలతో సహా దానిని తీసుకువెళ్లి కట్టేసి వేలాడ తీస్తున్నారు. ఇలా చేయడం వల్ల గాలి తగిలి ఉల్లిగడ్డలు కుళ్ళి పోకుండా ఉంటాయి. ఇలా చేస్తే మూడు నుండి నాలుగు నెలల పాటు ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా నిల్వ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news