మేడిగడ్డ మేడిపండు అయింది..సుందిళ్ల సున్నం అయింది : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో ప్రజలు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తాజాగా వరంగల్ లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘మేం కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు లేవు. నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదు అని అన్నారు. రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది అని సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్నారం ఆకాశాన్ని అంటింది. సుందిళ్ల సున్నం అయింది. కాళేశ్వరం వెళ్లాం రండి.. కేసీఆర్ కట్టిన అద్భుతమేంటో మేం చూపిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.

మోడీ, కేసీఆర్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పారని.. లోక్ సభ ఎన్నికల్లో మోడీకి గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ ఒక్క హామీ అయినా అమలు చేసిందా అని ప్రశ్నించారు. మోడీపై హర్యాణా రైతులు యుద్ధం ప్రకటించారని.. నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా చేశారన్నారు రేవంత్ రెడ్డి. మోడీ ప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగారం తిరస్కరించిందని ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news