మహాశివరాత్రి 2021: పూజలో, ఉపవాసంలో పాటించాల్సిన విషయాలు మీకోసం…!

-

హిందువులు ఎన్నో పండుగలను జరుపుకుంటారు. వాటిలో మహాశివరాత్రి కూడా ముఖ్యమైనది అనే చెప్పాలి. మహాశివరాత్రి నాడు శివాలయాలు అన్నీ కూడా ప్రత్యేక పూజలతో, భజనలతో నిండిపోతాయి. శివుడి భక్తులు అయితే రాత్రి పూట జాగారం చేస్తారు. ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాము. కొందరు అయితే మాఘ మాసం లోనే జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం మార్చి 11వ తేదీన శివ రాత్రి వచ్చింది. శివరాత్రి సందర్భంగా కొన్ని వ్రత పద్ధతులని, పాటించవలసిన విధానాలని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి..

మహా శివ రాత్రి ఉపవాసం:

శివరాత్రి నాడు భక్తులు ఉపవాసం చేస్తారు. అయితే ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు ముందుగా మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. మీరు కనుక ఆరోగ్యంగా ఉంటే అప్పుడు ఈ పద్ధతుల్ని అనుసరించండి.

తెల్లవారుజామునే లేస్తే మంచిది. అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందు అనమాట. ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. మొదట ధ్యానం చేసిన తర్వాత సంకల్పం చేయండి. మీరు చేసే ప్రతిదీ కూడా మనస్పూర్తిగా చేయాలి. ఉపవాసంలో ఏమి తీసుకోవాలి అనే విషయానికి వస్తే… అన్నం, గోధుమలు మొదలైన వాటిని తీసుకోవడం నిషిద్ధం.

ఇది పర్వదినం కాబట్టి ఉపవాసం చేసినప్పుడు మీరు పండ్లు, పాలు వంటివి తీసుకోవచ్చు. అలానే ఉపవాసానికి సంబంధించిన ఏమైనా రెసిపీస్ మీరు అనుసరించవచ్చు. కిచిడి, సగ్గుబియ్యం కిచిడీ లాంటివి ఏమైనా మీరు చేసుకుని తినవచ్చు. మామూలు ఉప్పు కాకుండా రాక్ సాల్ట్ ను ఉపయోగించడం మంచిది. లేదా సైంధవ లవణాన్ని ఉపయోగించవచ్చు.

మీ ఇంట్లో శివ లింగం లేదా శివుడి ఫోటో ఉంటే దానికి మీరు పూజలు చేయవచ్చు. దీపం వెలిగించి అభిషేకం చేయొచ్చు లేదా దేవాలయాలకు వెళ్లి అక్కడ దీపం పెట్టొచ్చు. అభిషేకం కోసం గంగాజలం, నీళ్లు, పచ్చి పాలు ఆలయానికి అక్కడ అభిషేకం చేయవచ్చు. దేవుడికి ఎంతో ప్రీతికరమైన ఉమ్మెత్త పూలు, మారేడు దళం సమర్పించండి. ఆ రోజు రాత్రి అంతా కూడా పూజలు, భజనలు వగైరా వంటివి చేస్తూ జాగారం ఉండవచ్చు.

ఉపవాసం చేయడం వెనక కారణం మరియు లాభాలు:

ముఖ్యంగా ఉపవాసం చేయడానికి గల కారణం ఏంటంటే..? రొటీన్ లైఫ్ కి కాస్త విరామం ఇవ్వడం. ఉపవాసం చేయడం వల్ల మీ ఒంట్లో టాక్సిన్స్ లాంటివి తొలగిపోతాయి. అలానే మీ యొక్క సెన్సెస్ ని మీ కంట్రోల్లో ఉంచుతుంది. మీ మైండ్ ని మరియు బాడీ ని కూడా ఉపవాసం చేయడం వల్ల పరిశుభ్రంగా ఉంచవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news