కరోనాపై పోరాటంలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడుతున్న తీరు నిజంగా అభినందనీయం. క్షణం తీరిక లేకుండా ఎక్కడిక్కడ వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. ఈ విషయంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. తాజాగా కలెక్టర్ వీపీ గౌతమ్ తన మానవత్వం చాటుకున్నారు. అసలు విషయం ఏంటీ అంటే….
కరోనా కట్టడిలో భాగంగా వైద్యుల పనితీరుని పర్యవేక్షించడానికి వెళ్లిన కలెక్టర్ కి అక్కడ రోగికి రక్తం అవసరం అని తేలవడంతో వెంటనే ఆలోచన చేయకుండా రక్తదానం చేసారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగింది. అక్కడే ఓ పేషెంట్ కు రక్తం అవసరం అయిన విషయం తెలసుకున్న కలెక్టర్ గౌతం తన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడంతో, ఏమాత్రం సందేహించకుండా రక్తదానం చేయడానికి రెడీ అయ్యారు.
లాక్ డౌన్ ప్రకటించడంతో ఆయన జిల్లా యంత్రాంగం పని తీరుని అభినందించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేస్తున్నారని అభినందించారు. జిల్లాలోని గడ్డిగూడెంలో తొలి కరోనా కేసు నమోదైందని, అతడి ద్వారా 200 మందికి సోకే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మహబూబాబాద్ మండలంలోని గడ్డిగూడెం, కంబాలపల్లి, దాట్ల, నేరడ, సండ్రగూడంతోపాటు ఏడు గ్రామాల్లో 26 మందికి వైద్య పరీక్షలు చేయగా ఇద్దరిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు.