తెలంగాణాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కేసులు పెరగడం తో ప్రభుత్వంలో కూడా ఆందోళన మొదలయింది. ఎక్కడిక్కడ చర్యలు చాలా జాగ్రత్తగా తీసుకున్నా సరే కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 404 మందికి కరోనా పాజిటివ్ రాగా… అందులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.
కేసులు ఏప్రిల్ 7 తో ఉండవని కేసీఆర్ భావించినా దాని వ్యాప్తి మాత్రం రోజు రోజుకి పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఇక మరణాలు మాత్రం రాష్ట్రంలో అదుపులోనే ఉన్నాయి ప్రతీ ఒక్కరికి చాలా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం చికిత్స అందిస్తుంది. మంగళవారం కరోనా బారిన 30 మంది పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేసులు తగ్గినట్టే తగ్గి పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.
ఇక ప్రత్యేక ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతుంది. స్కూల్స్ ని కూడా ఐసోలేషన్ వార్డ్స్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు అదుపులోనే ఉన్నా భవిష్యత్తులో ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో అవసరం అయితే కేంద్రం సాయం కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కేంద్రం కూడా తెలంగాణా మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది.