షర్మిల శిబిరంలో ముసలం.. పలువురు రాజీనామా

-

తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 8వ తెదీన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ పెట్టకముందుకే వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వచ్చేనెల పార్టీ ప్రకటన చేసేందుకు సిద్ధమైన షర్మిలకు షాకిచ్చారు కొందరు నాయకులు. పార్టీ నిర్మాణం కోసం ఆమె ఇప్పటికే అడ్ హాక్ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అడ్ హాక్ కమిటీలో ఉన్న కొందరు వైయస్సార్ అభిమానులు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైయస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటిరెడ్డి అడ్ హాక్ కమిటీకి రాజీనామా చేశారు.

అదే బాటలో మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. హుజుర్ నగర్ లో నీలకంఠ సాయి కుటుంబాన్ని ఈ పర్యటనలో షర్మిల పరామర్శించనున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని మనస్తాపంతో నీలకంఠ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కరోనాతో మృతిచెందిన గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు షర్మిల. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన నాగిరెడ్డి…వైఎస్సార్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news