కరోనా వచ్చినప్పటి నుంచి దేశం మొత్తం మార్మోగిపోతున్న ఒకే ఒక్క పేరు సోనూసూద్. ఎవరికి ఏ సాయం కావాలన్నా ఆయననే తలుచుకుంటున్నారు. మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన సేవలతో ప్రజల్లో నిజమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూ సూద్. ప్రభుత్వాలు కూడా చేయలేని అనేక పనులను చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఇక ఈ సెకండ్ వేవ్‌లో కూడా ఎంతోమందికి సాయం చేస్తున్నారు. మందులు అందిచడం దగ్గరి నుంచి ఆక్సీజన్ కాన్ సన్ ట్రేటర్ల దాకా అన్ని సేవలు చేస్తున్నారు. హాస్పిటల్లలో బెడ్లు సమకూర్చడం దగ్గరి నుంచి ఎన్నో రకాల సేవలు చేస్తున్నాడు సోనూ
అయితే ఆయనకు అతి పెద్ద డ్రీమ్ ఒకటుందని చెప్పాడు. రీసెంట్‌గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డ్రీమ్ గురించి వివరించాడు. దేశంలో ఉన్న పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యం అందంచడమే తన పెద్ద కల అని వివరించాడు. అయితే ఇది జరగాలంటే చాలా టైమ్ పడుతుందన్నాడు. స్కూళ్లు, ఆసుపత్రులను కట్టి సేవ చేయడమే తన అతిపెద్ద డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. ఎంతైనా సోనూసూద్ గ్రేట్ కదా.