ఈ రోజు ఈడీ విచారణకు మహేశ్ బాబు రానున్నారని అంటున్నారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మానీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బషీర్‌బాగ్‌లోని తమ ఆఫీసులో నేడు విచారణకు హాజరు కావాలని మహేశ్ బాబుకు నోటీసులు అందాయి.
సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌కు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయ్. చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో నేడు ఈడీ విచారణకు మహేశ్ హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.