Mahesh Babu: మహేశ్ బాబు లుక్ లీక్..‘సర్కారు వారి పాట’లో దుమ్మురేపే మాస్ మసాలా సాంగ్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తు్న్నారు. ఇటీవల చిత్రంలోని చివరి పాట షూట్ కూడ కంప్లీట్ అయినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సదరు ఫొటోలో మహేశ్ బాబు మోకాలి కింద కర్చీఫ్ కట్టుకుని కనిపించారు. దాంతో ఇది మాస్ సాంగ్ అని అర్థం అయింది. తాజాగా మహేశ్ లుక్ కూడా లీక్ అయింది. రంగు రంగుల చొక్కాలో కళ్లజోడు పెట్టుకుని మహేశ్ బాబు ఊర మాస్ లుక్ అదిరిపోయింది. ఈ సాంగ్ కు లిరిక్స్ అనంత శ్రీరామ్ అందించగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఇది ఒక డ్యాన్స్ నెంబర్ కాగా, లిరిక్స్ చాలా బాగా కుదరియాని తెలుస్తోంది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన ఈ సాంగ్ మహేశ్ బాబు – కీర్తిసురేశ్ లపై షూట్ చేశారు. ఇక ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతాయి. పిక్చర్ లో కీ రోల్ ప్లే చేసిన సముద్ర ఖని డబ్బింగ్ కంప్లీట్ చేశారు.‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ ను ఈ నెల 23న రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. వచ్చే నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ పిక్చర్ ను మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌ ప్రొడ్యూస్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news