
తెలంగాణలో కరోనా మహమ్మారి పెను దుమారమే రేపింది అని చెప్పాలి. ఎన్నో జాగ్రత్త చర్యలు చేపట్టే రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడ్డారు. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీని అతని కుటుంబాన్ని, అతని సిబ్బంధిని కరోనా మహమ్మారి దాడి చేసింది. దీంతో హోం మంత్రి అతని కుటుంబ సభ్యులు సహా అందరూ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన కరోనాతో పొరాడి కరోనా పై విజయం సాధించాడు. తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో నెగిటివ్ వచ్చింది. ఆయన కొడుకు, మనువడు కూడా పూర్తిగా కోలుకున్నారు. ఆయనతో పాటు తన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వ్యాధి నుండి బయటపడేందుకు ఎందరో ప్రార్థనలు చేశారని అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు అని ఆయన అన్నారు.