రాత్రి 7 గంటలకు వర్మ ’12 ఓ క్లాక్’..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సినిమా కంటే ముందే టైటిల్స్ తోనే ఆయా సినిమాలపై ప్రేక్షకులు చర్చించుకునేలా చేసి హైప్ క్రియేట్ చేస్తారు. సినిమాలో విషయం ఉందో లేదో అనే విషయం పక్కనపెడితే టైటిల్ తోనే సినిమాకి బజ్ తీసుకొస్తాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు అనౌన్స్ చేసాడు. లాక్‌ డౌన్ లో ‘క్లైమాక్స్’, ‘నేకేడ్’ వంటి చిత్రాలను నిర్మించి విడుదల చేసిన వర్మ..

వీటితో పాటు ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’ సినిమాలను కూడా ప్రకటించారు వర్మ. అంతేకాకుండా మరో కాంట్రవర్సీ టైటిల్ పెట్టి ‘పవర్ స్టార్’ అనే సినిమా చేయబోతున్నానంటూ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీని పేరు ’12 ఓ క్లాక్’ అని.. ఇది తన నుంచి వస్తున్న మరో హారర్ చిత్రమని వర్మ పేర్కొన్నారు. ఇదేమీ షార్ట్ ఫిల్మ్ కాదనీ, ఒక గంట 45 నిమిషాల నిడివితో ఈ సినిమా సాగుతుందని ఆయన చెప్పారు. ఈ రాత్రి 7 గంటలకు దీని ట్రైలర్‌ని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news