ఐపీఎల్‌లో పదునైనా బంతులతో ప్రత్యర్థి చుక్కలు చూపించిన బౌలర్ లిసత్ మలింగ. ఐపీఎల్ ప్రారంభం అయిన నాటి నుంచి లసిత్ మలింగ.. ముంబై ఇండియాన్స్ జట్టు తరపున ఆడాడు. ముంబైకి ఐదు సార్లు కప్ తీసుకురావడంలో మలింగ కీలక పాత్ర పోషించాడు. కాగ ఈ యార్కర్ కింగ్ కు ఐపీఎల్ అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అతధ్యిక వికెట్లు తీసిన బౌలర్ లసిత్ మలింగనే. కాగ లసిత్ మలింగ ఇటీవలే అన్ని ఫార్మట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐపీఎల్ కూడా ఆడటం లేదు. అయితే ఐపీఎల్ 2022 లో లసిత్ మలింగ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సారి బౌలర్ గా కాకుండా.. బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఐపీఎల్ లో మొదటి సారి కప్ కొట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. మలింగను బౌలింగ్ కోచ్ గా ఎంచుకుంది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపింది. కాగ రాజస్థాన్ డైరెక్టర్ గా.. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ఉన్నాడు. కాగ ఐపీఎల్ 2022 కోసం యువ సంచలనం సంజూ శాంసన్ నేతృత్వంలో బరిలోకి దిగుతుంది.
*𝐤𝐢𝐬𝐬𝐞𝐬 𝐭𝐡𝐞 𝐛𝐚𝐥𝐥*
Lasith Malinga. IPL. Pink. 💗#RoyalsFamily | #TATAIPL2022 | @ninety9sl pic.twitter.com/p6lS3PtlI3
— Rajasthan Royals (@rajasthanroyals) March 11, 2022