ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో థర్డ్ వేవ్ ఉన్న సమయంలో ప్రతి రోజు 10 నుంచి 15 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతు వచ్చాయి. కానీ ప్రస్తుతం థర్డ్ వేవ్ తగ్గడంతో కేసుల సంఖ్య భారీగా తగ్గుతు వస్తున్నాయి. కాగ నేటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కరోనా బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు.
ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 46 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 12,092 కరోనా శాంపిల్స్ ను పరీక్ష చేశారు. అలాగే ఈ రోజు కూడా రాష్ట్రంలో కరోనా మరణాలు సంభవించలేదు. కాగ గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 134 మంది బాధితలు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కేవలం 661 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.