మన ఇంట్లో తరచూ ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అటువంటి సమస్యల నుండి బయట పడాలంటే వాస్తు చిట్కాలు ఫాలో అవ్వాలి. వాస్తు చిట్కాలను అనుసరిస్తే తప్పకుండా సమస్యల నుండి బయట పడవచ్చు. అలానే ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవుతుంది.
ఈరోజు పండితులు మన ఇంట్లో సామాన్లు ఎలా సర్దుకోవాలి అనే విషయం గురించి చెప్పారు. నీటికి సంబంధించిన వస్తువులను ఈ విధంగా మార్చుకుంటే మంచి కలుగుతుందని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటున్నారు.
కుళాయిలు, షవర్లు, వాష్ బేసిన్, గీజర్ లు వంటి వాటిని సరైన దిక్కులో అమర్చుకోవడం చాలా ముఖ్యం అని అంటున్నారు. అయితే మరి వాటిని ఏ దిక్కులో పెడితే మంచిది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సరైన దిక్కులో పెట్టకపోతే నెగిటివ్ ఎఫెక్ట్స్ పడతాయి. ఎప్పుడూ కూడా కుళాయిలని కానీ షవర్లని కానీ ఈశాన్యం వైపు పెడితే మంచిదని అంటున్నారు.
ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలిగి.. నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. గీజర్ ని కూడా బాత్రూం లో పెట్టేటప్పుడు ఈ దిక్కులో ఉంచితే మంచిది. అదే బాత్ టబ్ ని ఉత్తర దిక్కులో ఉంచుకుంటే మంచిది. డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు కూడా ఉత్తరం దిక్కున ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఇంట్లో కనుక మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా సమస్యలేమీ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది అలానే సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.