ఈ తప్పులు చేస్తే బ్యాంక్ అకౌంట్ కాళీ అవుతుంది..!

-

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ని వాడుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్స్ వాడకం ఎలా పెరిగిపోయిందో ఫ్రాడ్స్ కూడా అలానే పెరిగిపోయాయి. మొబైల్ ఫోన్ వాడే వారు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. మీరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా అయితే మీకో అలర్ట్. మొబైల్ ఫోన్ వాడే వారు కచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే బ్యాంక్ అకౌంట్ (Bank account)ఖాళీ అయిపోయే ప్రమాదం వుంది. ఇటీవల కాలంలో ఆన్ లైన్ ద్వారా మోసాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంక్ కస్టమర్స్ జాగ్రత్తగా ఉండాలి.

బ్యాంక్ అకౌంట్/ Bank account
బ్యాంక్ అకౌంట్/ Bank account

అయితే ఈ విషయానికి సంబంధించి ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లను అలర్ట్ చేసింది. ఫేక్ యాప్స్‌తో అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. అన్‌ట్రస్టెడ్ సోర్స్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని తెలిపింది.

ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంక్ చెప్పడం జరిగింది. అయితే చాల మంది అన్‌ట్రస్టెడ్ సోర్స్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని.. ఇలా చేసుకోవడం వల్ల ఇబ్బందుల పడాల్సి వస్తుంది అని అంది.

ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు కస్టమర్ల వివరాలు పొందుతున్నారని… హ్యాకర్లు అన్‌ట్రస్టెడ్ సోర్స్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్ ద్వారా మీ ఫోన్‌ యాక్సెస్ చేస్తారు.

ఇలా బ్యాంక్ అకౌంట్ వివరాలు పట్టేసి డబ్బుల్ని తీసేసుకుంటున్నారు. ఇప్పటికే మీరు అన్‌ట్రెస్టెడ్ సోర్స్ ద్వారా ఏమైనా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉంటే ఆ యాప్స్ ని తొలగించడం మంచిది. లేదు అంటే ఇబ్బందులు తప్పవు.

 

Read more RELATED
Recommended to you

Latest news