బాలీవుడ్ హాట్ భామ నటి మలైకా అరోరా తన భర్త అర్భాజ్ ఖాన్ తో గత కొన్ని నాలుగు క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా వీరిద్దరూ ఒక హోటల్లో డిన్నర్ చేయడానికి వెళుతూ మీడియా కంటికి చిక్కారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది..
నటి మలైకా అరోరా ప్రస్తుతం అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే వీరిద్దరూ బాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ జంటగా ఉన్నారు ఎప్పటికప్పుడు వెకేషన్ కి వెళ్తూ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు అలాగే మలైకా కూడా ఎప్పుడు బయట కనిపించిన ఇప్పటి స్టార్ హీరోయిన్లతో పోటీ పడదు ఫ్యాషన్ ఫాలో అవుతూ ఉంటారు అయితే తాజాగా ఓ ట్రెండీ లుక్ లో తన మాజీ భర్తతో కలిసి ఓ హోటల్లో డిన్నర్ కు వెళ్ళటం ప్రస్తుతం చర్చనీయాంసంగా మారింది..
మలైకా తన భర్తతో 2017లో విడిపోయింది.. అయితే వీరిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు.. అయితే విడాకులు అనంతరం వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు.. కానీ గతేడాది యూఎస్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తమ కుమారుడు అర్హాన్ ఖాన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నప్పుడే కలిసి కనిపించారు. అయితే మళ్లీ ఈసారి ఇలా కనిపించారు.. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో మలైకా తన మాజీ భర్త కోసం చెప్పుకొచ్చింది విడిపోయిన తర్వాత కూడా అతను తన కుటుంబానికి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాగా చూసుకున్నాడని ఆ సమయంలో అతను చూపించిన అభిమానం చూసి చలించిపోయానని తెలిపింది.. అయితే ఇప్పుడు ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా వచ్చినప్పటికీ కలిసే హోటల్ కి వెళ్లారు అక్కడే ఉన్న మీడియా క్లిక్ మనిపించింది.. అయితే ఈ విషయంపై మాత్రం నటిజన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్లు చేస్తున్నారు మాజీ భర్తతో డిన్నర్ కు వెళ్లడం ఏంటి? అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఏమో తన భర్త కుటుంబానికి తన కొడుకు దగ్గరగా ఉన్నాడు కదా.. అలా అయినా వెళ్లి ఉండవచ్చు.. కారణం ఏదైనా కావచ్చు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు..