తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణశాఖ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అాలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
నిన్నకూడ హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హఫీజ్ పేట, చందానగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్ పేట, బేగంపేట, ఎస్ ఆర్ నగర్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, నల్లి, ఖైరతంపాబాద్, కేపీహెచ్‌బీ, కేపీహెచ్‌బీలో వర్షం కురిసింది. జెఎన్టీయూ మరియు నిజాంపేటలో. మరికొన్ని గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది.