ముంబైలో రన్నింగ్ ట్రైన్‌లో నుండి పడిపోయిన యువకుడు..వీడియో వైరల్

-

Man in viral video falling off running Mumbai local train: ముంబైలో రన్నింగ్ ట్రైన్‌లో నుండి ఓ యువకుడు కిందపడిపోయాడు. దీంతో అతడి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని కళ్యాణ్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

రన్నింగ్ ట్రైన్‌లో వేలాడి కింద పడిపోయినందుకు గాను 18 ఏళ్ల యువకుడిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన యువకుడు నడుస్తున్న ముంబై లోకల్ ట్రైన్‌లో మోటార్ కోచ్ డోర్‌కి వేలాడుతూ కింద పడిపోవడం వైరల్ వీడియోగా మారడంతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆ వ్యక్తిని కాల్వకు చెందిన డానిష్ జాకీర్ హుస్సేన్ ఖాన్ (18)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొన్న ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటన అనంతరం స్థానికులు, బాధితుడి బంధువు అతడిని ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అతడి కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

https://x.com/TeluguScribe/status/1816725010838389054

 

Read more RELATED
Recommended to you

Latest news