బిగ్ బ్రేకింగ్ : ప్రొద్దుటూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్ లో వరుస మర్డర్ కేసులు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న పాత కక్షల నేపథ్యంలో విశాఖ జిల్లా జుత్తాడలో ఒక వ్యక్తి ఆరుగురిని చంపిన ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.

కుటుంబ కలహాలతో కరీముల్లా అనే వ్యక్తి తన సొంత కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా చంపేశాడు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని చెబుతున్నారు. సొంత తల్లి, సోదరి, తమ్ముడిని హతమార్చిన నిందితుడు కరీముల్లా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.