విజయనగరం మహారాజా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక ఐదుగురు చనిపోయారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంటో ఐదు మంది పైగా మృతి చెందారని హాస్పిటల్ లోని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ లో ప్రెజర్ తక్కువగా రావడంతో సాంకేతిక సమస్య కారణంగా వారు చనిపోయారని ముందు ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయారు అని కలెక్టర్ హరి జవహర్ లాల్ అంటున్నారు.
ఆ రెండు కూడా మరణాలు సాధారణ కరోనా మరణాలు అని ఆయన అన్నారు. ఇద్దరు మృతి చెందారు. ఈ మృతులు కూడా ఆక్సిజన్ సరఫరా అందక చనిపోలేదని, రోజువారీ కరోనా మృతులేనని ఆయన చెబుతున్నారు. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మంది ఆక్సిజన్ తో ఉన్నారని, ఇంకా కొంతమందికి ఆక్సిజన్ అందించే క్రమంలో లో ప్రెజర్ తక్కువ అయిందని అంతే తప్ప ఇంకే పరిణామం జరగలేదని ఆయన చెబుతున్నారు.