నేను ‘చనిపోతున్నా.. నన్ను క్షమించండి’ అంటూ ఉరితాడుతో సెల్ఫీ !

-

ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. అలా ఒక వ్యక్తి నేను చనిపోతున్నాను నన్ను క్షమించండి అంటూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టి ఆ తరువాత మెడకు ఉరి వేసుకున్న సెల్ఫీ దిగి స్టేటస్ పెట్టాడు. అలాగే దానిని స్నేహితులందరికీ పంపించాడు కూడా. ఆ తర్వాత అతను ఉరి వేసుకుని మరణించాడు. ఈ దారుణ ఘటన ఆత్మకూరులో చోటు చేసుకుంది..

అందుతున్న సమాచారం మేరకు రమేష్ అనే 24 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేస్తున్నాడు. నిన్న స్నేహితులకు ఫోన్ చేసి తాను ఇన్ని రోజులు పేదరికంలోనే జీవించానని అందుకే జీవితమంటే విరక్తి చెందిందని అందుకే చనిపోతున్నా అని చెప్పి ఆత్మకూరు వీర్ల  చెరువు సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఉరేసుకున్నాడు. దానికి ముందు ఉరి వేసుకుంటూ ఒక సెల్ఫీ దిగి నేను చనిపోతున్నాను నన్ను క్షమించండి అంటూ స్టేటస్ పెట్టడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news