బర్త్ డే రోజే పిల్లలపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన తండ్రి

-

ఉత్తరప్రదేశ్​ బిజ్​నోర్ జిల్లా, గోపాల్‌పుర్ గ్రామానికి చెందిన అరుణ్ తన కుమారుడి పుట్టిన రోజునే క్రూరంగా ప్రవర్తించాడు. అరుణ్​కు ఆరవ్, ఊర్వశి అనే ఇద్దరు పిల్లలున్నారు. అక్టోబర్ 30న ఆరవ్ పుట్టిన రోజు. కొడుకు బర్త్ డేను ఘనంగా చేయాలని భావించి బంధువులందరిని పిలిచారు అరుణ్ దంపతులు. ఈ వేడుక సమయంలో అతిథుల కోసం వండిన అన్నం తక్కువైంది. విషయం తెలిసిన అరుణ్ భార్య బందనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మద్యం మత్తులో బందనపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు.

అప్రమత్తమైన ఆమె త్రుటిలో తప్పించుకుంది. కానీ పక్కనే ఉన్న పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. గమనించిన బంధువులు వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లలిద్దరికీ దాదాపు 30 శాతం కాలిన గాయాలయ్యాయని జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరికీ ఎటువంటి ప్రాణ హాని లేదన్నారు. వందన తన భర్తపై మంగళవారం రోజున పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news