కార్తీక్ ధర్ అనే వ్యక్తి ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో భోజనం చేశాడు. అయితే భోజనం అనంతరం వచ్చిన బిల్లును చూసి అతను షాక్ తిన్నాడు.
చండీగడ్‌లో జేడబ్ల్యూ మారియట్ హోటల్ కేవలం రెండు అరటి పండ్లకే ఏకంగా రూ.442 బిల్లు వేసింది గుర్తుంది కదా. నటుడు రాహుల్ బోస్‌కు ఈ ఘటన ఎదురైంది. దీంతో అతను ట్విట్టర్ వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఈ క్రమంలో చర్యలు తీసుకున్న అక్కడి అధికారులు ఆ హోటల్‌పై రూ.25వేల ఫైన్ వేశారు. అయితే సరిగ్గా అలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
కార్తీక్ ధర్ అనే వ్యక్తి ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో భోజనం చేశాడు. అయితే భోజనం అనంతరం వచ్చిన బిల్లును చూసి అతను షాక్ తిన్నాడు. తాను ఆర్డర్ చేసిన రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లకు రూ.1700, 2 ఆమ్లెట్లకు రూ.1700, మరో రెండు ఆమ్లెట్లకు ఒక్కొక్కటి రూ.850 చొప్పున అదొక రూ.1700, రెండు డైట్ కోక్‌లకు ఒక్కొక్కి రూ.260 చొప్పున మొత్తం రూ.520, మరొక కోక్‌కు రూ.260, ఫుడ్‌కు రూ.5100, శీతలపానీయానికి రూ.780, జీఎస్‌టీ రూ.1058.40 మొత్తం కలిపి రూ.6,938.40 బిల్లు వచ్చింది. దీంతో అతను షాక్ తిన్నాడు.
2 eggs for Rs 1700 at the @FourSeasons Mumbai. @RahulBose1 Bhai Aandolan karein? pic.twitter.com/hKCh0WwGcy
— Kartik Dhar (@KartikDhar) August 10, 2019
అలా తాను తిన్న ఆహారాలకు దారుణమైన బిల్లు వచ్చే సరికి కార్తీక్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో నటుడు రాహుల్ బోస్ పెట్టినట్లుగానే ఆ బిల్లు కాపీని ఫొటో తీసి అతను కూడా ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయంపై సదరు హోటల్ ఇంకా స్పందించలేదు. మరి సంబంధిత అధికారులు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.