ఓ వ్యక్తి మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. దిల్ సుక్ నగర్ మెట్రో స్టేషన్ పై నుండి వ్యక్తి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం… వ్యక్తి మెట్రో స్టేషన్ పై నుండి దూకగానే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఆ వ్యక్తి మెట్రో స్టేషన్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ప్రమాదవశాత్తు పడి ఉంటాడా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక వ్యక్తి పై నుంచి పడిన వెంటనే స్టేషన్ వద్ద ప్రజలు భయాందోళన కు గురయ్యారు.