తెలుగు రాష్ట్రాలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉప ఎన్నిక సంగ్రామానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. హుజూరాబాద్, బద్వేల్ నియోజకవర్గాలకు బైపోల్ కు నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు. ఈనెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 2న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించగా, మరో ప్రధాన పార్టీలైనబీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేరు దాదాపుగా ఖరారైనా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. నేడు రేపు అభ్యర్థి ప్రకటన అంటూ ఊరిస్తుంది తప్పతే అభ్యర్థి ఎంపికపై స్పష్టత ఇవ్వడం లేదు. నేడు పేరు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ చెబుతోంది.
నేడే బైపోల్ కు నోటిఫికేషన్..
-