ప్రమోషన్ ఇవ్వలేదని బాస్ కుటుంబాన్ని అంతం చేసి.. ఎనిమిదేళ్లకు..?

-

ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వలేదన్న కోపంతో బాస్ కుటుంబాన్ని మొత్తం అంతం చేశాడు. హత్య తర్వాత అమెరికా నుంచి తన సొంత దేశమైన చైనాకు పరారయ్యాడు. ఎనిమిదేళ్ల తర్వాత ఇటీవల మళ్లీ అమెరికాలో అడుగుపెట్టి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సెప్టెంబర్ 11న శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే నిందితుడు ఫాంగ్ లూని అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు.

shot from a handgun with fire and smoke

ఓ ఆయిల్‌ కంపెనీలో పనిచేసే ఫాంగ్‌ లూ.. వేరే విభాగానికి ప్రమోట్‌ చేయాలని తన బాస్‌ మవోయే సన్‌ను అభ్యర్థించాడు. కానీ లూకు బాస్ ప్రమోషన్ ఇవ్వలేదు. అతడిపై కోపం పెంచుకున్న లూ బాస్ తో గొడవకు దిగినట్లు సమాచారం. ఈ గొడవ జరిగిన కొన్ని రోజుల తర్వాత 2014 జనవరి 30న లూ బాస్ మవోయే సన్ తో పాటు అతడి భార్య, ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ నలుగురి శరీరాలపై ఉన్న బుల్లెట్ గాయాలను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.

పోలీసుల దర్యాప్తులో మవోయేకు చివరిసారిగా లూతోనే గొడవ జరిగిందని తెలిసింది. అతడే  ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చన్న అనుమానంతో లూని విచారించారు. బాస్‌తో గొడవపడిన విషయం వాస్తవమే ఐనప్పటికీ ఆ హత్యలు తాను చేయలేదని ఫాంగ్‌ లూ బుకాయించాడు. అతడి దగ్గరున్న తుపాకీ గురించి విచారించగా విరుద్ధమైన సమాధానాలు ఇచ్చాడు. దీంతో అతనిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు. ఆ ఫలితాలు వచ్చి, అతడిపై వారెంట్‌ జారీచేసే నాటికి నిందితుడు సొంత దేశమైన చైనాకు పారిపోయాడు. దీంతో అప్పటినుంచి ఆ కేసు విచారణ మరుగునపడిపోయింది.

ఇది జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత.. ఇటీవల (సెప్టెంబర్‌ 11న) ఆ నిందితుడు చైనా నుంచి అమెరికా తిరిగి వచ్చాడు. శాన్‌ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news